NTV Telugu Site icon

Child Care Leave: మహిళా ఉద్యోగులకు జగన్ కానుక.. చైల్డ్‌ కేర్‌ లీవ్‌ వాడుకునే ఛాన్స్

Childcare

Childcare

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా ఉద్యోగులకు మరో అవకాశం కల్పించారు. మహిళా ఉద్యోగులు సర్వీసు కాలంలో ఎప్పుడైనా 180 రోజుల చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను వాడుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎం వి రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలు క‌లిశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎమ్మెల్సీలు టి కల్పలత, ఎం వి రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి సీఎంకు విజ్ఞాపన పత్రం అందజేశారు.

Read Also: Russia : తక్కువ ధరకే ఇండియాకు చమురు సరఫరా.. రష్యా కీలక నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల 180 రోజుల చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను… పిల్లలు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మాత్రమే వాడుకోవాలన్న నిబంధనను తొలగించాలని సీఎంకు విన్నవించారు ఎమ్మెల్సీలు. దీనిపై సీఎం స్పందించారు. ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నిబంధనను మార్పు చేస్తూ… సర్వీసు కాలంలో ఎప్పుడైనా 180 రోజుల చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను మహిళా ఉద్యోగులు వాడుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. పిల్లల సంరక్షణకు అవకాశం ఉంటుందని మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ప్రైవేటు స్కూళ్ల రెన్యువల్‌ ఆఫ్‌ రికగ్నైజేషన్‌ను మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలకు పెంచాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

Read Also: WPL2023 : గ్రాండ్ విక్టరీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఫైనల్ బెర్త్ ఖరారు..?

Show comments