YSR Asara: అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. డ్వాక్రా సంఘాల ఖాతాల్లో సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేశారు. వైఎస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నామని.. దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించనంత తేడా ఏపీలో కనిపిస్తోందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.6,395 కోట్లు జమ చేశామని సీఎం వెల్లడించారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 79 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు.
Read Also: CM YS Jagan: నేతాజీకి సీఎం జగన్ నివాళులు
సీఎం జగన్ మాట్లాడుతూ..” ఎక్కడా వివక్ష చూపడం లేదు.. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.. ఆసరా కింద 56 నెలల్లో రూ. 25,571 కోట్ల రుణాల చెల్లింపు.. వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ ఆసరా ద్వారా మహిళల ఖాతాల్లోకి రూ.31 వేల కోట్లు బదిలీ.. జగనన్న అమ్మఒడి కింద రూ.26,067 కోట్లు అందించాం.. వైఎస్సార్ చేయూత ద్వారా మహిళా ఖాతాల్లో రూ.14, 129 కోట్లు జమ చేశాం.. గత ప్రభుత్వ హయాంలో మహిళలకు ఇలాంటి సంక్షేమ పథకాలు ఎందుకు అందలేదు.. ముఖ్యమంత్రి మారడం వల్లే ఇప్పుడు ప్రజలకు పథకాలు అందుతున్నాయి.”అని సీఎం అన్నారు. గతంలో ప్రజాధనం దోచుకోవడం మాత్రమే ఉండేదన్నారు.