ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కేంద్ర సహకార బ్యాంకులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష నిర్వహించిన సమీక్షలో.. వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి గోవర్థన్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయం, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్థికశాఖ కార్యదర్శి కెవీవీ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సమీక్షలో పీఏసీఎస్‌లు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌ల బలోపేతంపై చర్చించారు. వాటి నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం దిశగా సీఎం జగన్ చర్చించారు.
Mr. Pregnant: నైజాంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ను డెలివర్ చేస్తున్న మైత్రీ మూవీస్
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను, రైతు భరోసా కేంద్రాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేశామన్నారు. ఆర్బీకేలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా డీసీఎంఎస్ పనులు, కార్యక్రమాల పై అధ్యయనం జరగాలని అధికారులకు తెలిపారు. ప్రైమరీ, సెకండరీ పుడ్ ప్రాసెసింగ్ వ్యవస్ధలు డీసీఎంఎస్‌ల ద్వారా ఇంటిగ్రేడ్ కావాలని పేర్కొన్నారు. వీటన్నింటి మీద సమూల అధ్యయనం చేసి చర్యల కోసం తగిన నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను కోరారు.
Errabelli Dayakar Rao : లేని పోనీ కూతలు కూస్తున్న ప్రతిపక్షాలకు వీఆర్ఏలు బుద్ధి చెప్పాలి
మరోవైపు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో ప్రొఫెషనలిజం పెంచామని సీఎం జగన్ తెలిపారు. పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లలో కూడా ప్రొఫెషనలిజం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు అందించే ఎరువులు, మిగిలిన వాటిలో నాణ్యత చాలా ముఖ్యమని.. కల్తీలకు ఆస్కారం లేకుండా చూడాలని సీఎం చెప్పారు. నవంబర్ నాటికి పీఏసీఎస్‌లలో పూర్తి స్థాయి కంప్యూటరీకరణ రావాలని తెలిపారు. పీఏసీఎస్‌ల కింద నడిచే పెట్రోలు బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అన్నారు. అంతేకాకుండా.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో పీఏసీఎస్‌లు కీలక పాత్ర పోషించాలని.. కమర్షియల్ బ్యాంకుల కన్నా.. తక్కువ వడ్డీలకే రైతులకు, మహిళలకు వడ్డీలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
