Site icon NTV Telugu

CM Jagan : మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత తొలిసారి జనంలోకి జగన్‌

Cm Jagan

Cm Jagan

నేటి నుంచి సీఎం జగన్‌ మలిదశ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్‌. మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత తొలిసారి జనంలోకి జగన్‌ వస్తున్నారు. ప్రతి రోజూ మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలోనే.. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో జగన్‌ బహిరంగ సభలో పాల్గొంటారు.. అలాగే. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి జిల్లా వెంకటగిరిలో సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరులో సభకు హాజరుకానున్నారు జగన్‌. సభ తర్వాత తాడేపల్లి నివాసానికి సీఎం జగన్‌ చేరుకుంటారు. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజ­యంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.

 

రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్సార్‌ సర్కిల్‌లో ఆదివారం ఉ.10 గంటలకు నిర్వహించే బహిరంగసభతో ఈ ప్రచార భేరి మోగిం­చనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 29న (సోమవారం) అనకాపల్లి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన షెడ్యూల్‌ విడుదల చేశారు. 29 ఉ.10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలో.. అదేరోజు మ.12.30కు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో.. సా.3.00 గంటలకు గుంటూరు జిల్లా పొన్నూ­రు సభల్లో సీఎం జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారన్నారు.

 

Exit mobile version