Site icon NTV Telugu

CM Jagan : సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు విరామం

Jagan

Jagan

ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ నిర్వహిస్తోన్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని చింతారెడ్డి పాలెం దగ్గర క్యాంప్ లో జగన్ బస చేయనున్నారు. ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. నెల్లూరు జిల్లాలో నేతలతో ఆయన ప్రత్యేకించి మాట్లాడతారు. వారికి రానున్న ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో గెలుపు సాధించే దిశగా చేయాల్సిన ప్రయత్నాలపై దిశానిర్దేశం చేయనున్నారు. నెల్లూరు జిల్లాలోని వైసీపీ ముఖ్యనేతలకు క్యాంప్ సైట్ వద్దకు రావాలని పిలుపు వెళ్లింది. జగన్ మేమంతా బస్సు యాత్ర గత నెల 27వ తేదీన ఇడుపుపల పాయ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆయన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పర్యటించి నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. ప్రతి రోజు వివిధ వర్గాల వారితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సాయంత్రం బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.

 

Exit mobile version