NTV Telugu Site icon

Cm Jagan At Tirumala: శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాల సమర్పణ

Jagan Tml

Jagan Tml

తిరుమల కొండ భక్తజనసంద్రంగా మారింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు సీఎం జగన్. అంతకుముందు బేడీ ఆంజనేయస్వామి దర్శనానంతరం సీఎం జగన్‌ కి పరివట్టం కట్టారు అర్చకులు.. శ్రీవారి ఆలయానికి ఉరేగింపుగా చేరుకున్న సీఎం జగన్.. మహాద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేశారు.సంప్రదాయ పంచెకట్టులో జగన్ అలరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.

 

సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. సీఎం జగన్ వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు వున్నారు. గోవింద నామస్మరణతో ఏడుకొండలు దద్దరిల్లాయి.తిరుమల రంగనాయకుల మండపంలో సియం జగన్ కి వేదఆశీర్వచనం అందచేశారు. అనంతరం తీర్దప్రసాదాలు అందజేశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.