ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు అనకాపల్లిజిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన జరగనుంది. మాకవరపాలెంలో సుమారు 500కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి., మెడికల్ కాలేజ్ కోసం సీఎం భూమి పూజ చేస్తారు. ఈ మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వస్తే అనకాపల్లి జిల్లాతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని నాలుగైదు మండలాలకు వైద్య సేవలు మరింత చేరువ అవుతాయి.
Read Also: Dhamaka: ఒరేయ్ ఆజాము… మాస్ పార్టీ మొదలయ్యింది రోయ్…
తాండవ ఆయకట్టు రైతులతో పాటు మెట్ట ప్రాంత భూములను సస్యశ్యామలం చేసే కీలకమైన తాండవ ఎత్తిపోతలకు సీఎం జగన్ రేపు శంకుస్థాపన చేస్తారు. ఏలేరు జలాలను తాండవ రిజర్వాయర్ కు మళ్ళించడం ద్వారా సుమారు 60వేల ఎకరాలకు అదనంగా సాగునీటి ని పంపిణీ చేయడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. సుమారు 450కోట్ల రూపాయలను ఇందు కోస్ వెచ్చిస్తుండగా నాలుగు నియోజకవర్గాల పరిధిలో రైతులకు మేలు చేకూరుతుంది. సీఎం పర్యటనలో భాగంగా నర్సీపట్నం మండలం జోగు నాథుని పాలెంలో భారీ బహిరంగ సభ జరగనుంది.
ఈ బహిరంగసభ కోసం భారీ ఏర్పాట్లు చేయగా అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. శుక్రవారం ఉదయం 11గంటలకు నేరుగా సభాస్థలికి చేరుకుంటారు సీఎం జగన్. అక్కడి నుంచే శంఖుస్థాపనలు పూర్తి చేస్తారు. సీఎం పర్యటన మొత్తం 2గంటల పాటు కొనసాగుతుంది. ఈ పర్యటనకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు వైసీపీ నేతలు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.
Read Also: CS Somesh Kumar: ఢిల్లీలో తెలంగాణ సీఎస్.. పెండింగ్ నిధుల చెల్లింపుపై కేంద్ర కార్యదర్శులతో మీటింగ్
