Site icon NTV Telugu

CM Chandrababu: ఇక్కడ ఉంది సీబీఎన్.. వైఎస్ జగన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం!

Sam

Sam

CM Chandrababu Warns YS Jagan Over Kovur MLA Controversy: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే విమర్శించాడని.. ఇంతకీ అతను పశువువా, మనిషా అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తానైతే మరోసారి అలాంటివి జరగకుండా చూడాలని మందలించేవాడినని, కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పరామర్శించాడని సీఎం మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రసన్న నివాసంపై దాడి చేశారు. తాజాగా ప్రసన్నను జగన్ పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఫైర్ అయ్యారు. అలానే వైఎస్ జగన్‌కు సీఎం వార్నింగ్ ఇచ్చారు. లేపేస్తే చూడడానికి ఇక్కడ ఉంది సీబీఎన్ అని పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తీసుకువచ్చాం. రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. అమెరికా పెంచిన టారిఫ్ వలన ఆక్వా రైతులకు ఇబ్బంది. దీనిపై ఆక్వా రైతులతో చర్చించి పరిష్కరిస్తాం. రాష్ట్రంలో 1000 టీఎంసీల నీటితో రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేయడానికి నదులు అనుసంధానం చేస్తాం. గత ప్రభుత్వంలో ఉచిత బీమా చేయకుండా నాశనం చేశారు. ఉచిత బీమా ప్రవేశపెట్టిన పార్టీ ఎన్డీఏ. గత ప్రభుత్వంలో గుండ్లకమ్మ గేట్లు కూడా రిపేరు చేయలేదు. గుండ్లకమ్మ గేట్లు పెట్టడంతో పాటు నీళ్లు నిల్వ చేశాం. 95-96లో వెలుగొండ నేనే ప్రారంభించా. వెలుగొండ పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వానిది. సమైక్యాంధ్రప్రదేశ్లో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేశా. ఎవరికి ఆ అవకాశం రాలేదు. నేను చేసిన అభివృద్ధి వలన హైదరాబాద్ దేశానికి తలమానికం అయ్యింది. హైదరాబాద్ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను అభివృద్ధి చేస్తాం. 2047 కి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రానికి చిరునామాగా ఏపీని తయారు చెయ్యాలి’ అని అన్నారు.

Also Read: IND vs ENG: జైస్వాల్‌కు బయపడి.. అంపైర్‌కు అబద్దం చెప్పిన ఇంగ్లండ్ కెప్టెన్! వీడియో వైరల్!

‘అమరావతి ఆడబిడ్డలని బ్రోతల్స్‌గా సాక్షిలో చిత్రీకరించారు. వైఎస్ జగన్ పొదిలి వచ్చిన సమయంలో ఆడబిడ్డలు క్షమాపణ చెప్పమని అడిగారు. ఆడబిడ్డలపై దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యక్తి గత జీవితాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే విమర్శించాడు. అతను పశువువా, మనిషా. నేనైతే మరోసారి అలాంటివి జరగకుండా చూడాలని మందలించేవాడిని. కానీ జగన్ ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. అవసరమైతే ఇళ్లల్లోకి వెళ్లి టీడీపీ వాళ్ళని లేపేస్తామని జగన్ అన్నాడు. నేను ఒకసారి ఏమారితే నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో రాశారు. గుంటూరులో జగన్ కారు కింద కార్యకర్తల పడితే చికిత్స చేయకుండా పక్కన పడేశారు. బంగారుపాళ్యంలో వైసీపీ మనుష్యులతో ధర లేదని విన్యాసం చేశారు. నెల్లూరులో జనం లేరని బంగారుపాళ్యాం వీడియోలు పెట్టారు. జగన్ రెడ్డిని చూసి గొడ్డలి వేట్లు, బూతుల పంచాంగం, రప్పారప్పా నేర్చుకుంటున్నారు. జగన్ లేపేస్తే చూడడానికి ఇక్కడ ఉండేది సీబీఎన్. గతంలో తీవ్ర వాదులు, ముఠా నాయకులపై పోరాడా. ఇప్పుడు ఇలాంటి నేరస్తులు రాజకీయ ముసుగులో వస్తున్నారు. ఆ ముసుగులు తొలగించాల్సిన అవసరం ఉంది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Exit mobile version