ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్లారు. పద్మావతి అతిధి గృహం నుంచి కుటుంబంతో కలిసి శ్రీవారి ఆలయానికి భయలుదేరి, కుటుంబ సమేతంగా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఇఓ శ్యామలరావు, అదనపు ఇఓ వెంకయ్య చౌదరి సీఎం చంద్రబాబుుకు స్వాగతం పలికారు. మంగళవాయుద్యాలు.. వేదమంత్రోచ్చారణల మధ్య మనవడు దేవాన్ష్ తో కలిసి ఆలయ ప్రవేశం చేశారు. చంద్రబాబు కుటుంబసభ్యులను ప్రధాన అర్చకులు ఆశ్వీరదించారు.
Also Read:Pakistan: పాక్‌లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల మృతి
మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు సీఎం చంద్రబాబు. మనవడు బర్త్ డే సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. దర్శనానంతరం అన్నప్రసాద సముదాయం చేరుకొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ఇవాళ అన్నప్రసాద వితరణకు అయ్యే 44 లక్షల రూపాయలను దేవాన్ష్ పేరు మీదుగా నారా భువనేశ్వరి విరాళంగా అందించారు. ఆ తర్వాత అన్నప్రసాద సముదాయం నుంచి అన్నమయ్య భవన్ కి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా టీటీడీపై అధికారులతో సమీక్షించనున్నారు.