Site icon NTV Telugu

Chandrababu Naidu: తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు హత్యపై హోంమంత్రిని నివేదిక కోరిన సీఎం..

Chandrababu

Chandrababu

Chandrababu Naidu: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడులో తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు హత్యపై సీఎం చంద్రబాబు హోంమంత్రిని నివేదిక కోరారు. కూటమి నేతలతో కలిసి రాళ్లపాడు వెళ్లి ఘటనపై నివేదిక ఇవ్వాలని హోం మంత్రి అనితను ఆదేశించారు. తన సోదరులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న లక్ష్మీనాయుడును కొద్దిరోజుల క్రితం అదే గ్రామానికి చెందిన హరిచంద్రప్రసాద్ కారుతో గుద్ది చంపాడు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు పోలీసులు.. ఘటనపై రాజకీయంగా దూమారం లేవడంతో మరింత లోతుగా విచారణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జనసేన, బీజేపీ నేతలతో కలిసి బాధిత కుటుంబ వద్దకు వెళ్లాలని సీఎం చంద్రబాబు హోంమంత్రి అనితకు ఆదేశించారు.

READ MORE: Prabhas – Sukumar: సుక్కు – ప్రభాస్ కాంబో సెట్టు.. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో!

ఇప్పటికే ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ మాట్లాడారు. మూడు పార్టీల నుంచి నేతలను బాధిత కుటుంబం వద్దకు పంపాలని నిర్ణయించారు. కాగా.. హోంమంత్రి బృందం హత్యకు కారణాలు, పోలీసు విచారణ, తీసుకున్న చర్యలు, బాధిత కుటుంబానికి అందిన సాయంపై సమగ్రంగా చర్చించి నివేదిక ఇవ్వనుంది. హోంమంత్రి అనిత, స్థానిక కూటమి పార్టీల నేతలు బాధిత కుటుంబాన్ని కలవనున్నారు.

READ MORE: Vishal : అవార్డులన్నీ డ్రామా.. నాకొస్తే చెత్తలో పడేస్తా – విశాల్ బోల్డ్ స్టేట్‌మెంట్

Exit mobile version