Site icon NTV Telugu

CM Chandrababu: గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ‘జీరో ఫేర్ టిక్కెట్’

Chandrababu

Chandrababu

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. ఆగస్ట్‌ 15 నుంచి మహిళలకు బస్సుల్లో జీరో ఫేర్‌ టికెట్‌ ఇవ్వాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు కావాలి అని ఆదేశించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళ లకు జీరో ఫేర్ టికెట్లు ఇవ్వాలి.. టికెట్ పై ఇస్తున్న రాయితీ టికెట్ పై ఉండాలి.. మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వివరాలతో టిక్కెట్ల జారీ.. రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు.. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి-చార్జింగ్ స్టేషన్లతోనే స్వయం సమృద్ధి ఉంటుందని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

Exit mobile version