NTV Telugu Site icon

AP CM Chandrababu: ఉచిత ఇసుక సరఫరా సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

Chandrababu

Chandrababu

AP CM Chandrababu: ఉచిత ఇసుక సరఫరా అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.ఉచిత ఇసుక సరఫరా సమీక్షలో కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఇకపై ప్రతి రోజూ ఇసుక సరఫరా జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇసుక బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. ఇసుక సరఫరాలో ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ, ఈమెయిల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబర్: 1800-599-4599, ఈ మెయిల్-ఐడి: dmgapsandcomplaints@yahoo.com లను సర్కారు ఏర్పాటు చేసింది. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ఉచిత ఇసుక విధానంపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇసుక రవాణ ఛార్జీలను నోటిఫై చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

Read Also: YS Jagan: అచ్యుతాపురం ప్రమాదంపై మాజీ సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

ఉచిత ఇసుక సరఫరాపై ప్రతి రోజూ జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలు.. రవాణను కట్టడి చేసే బాధ్యత కలెక్టర్లదేనన్నారు. ఇసుక వినియోగదారుల బుకింగ్, రవాణా వ్యవస్థలను మరింత సులభతరం చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్టాక్ పాయింట్ల వద్ద రద్దీని నివారించాలని ఆయన సూచించారు. బుకింగ్ ఇన్వాయిస్ లేకుండా లారీలు స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్లకుండా కట్టడి చేయాలన్నారు. బుకింగ్ ఇన్వాయిసుల తనిఖీ కోసం స్టాక్ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక రవాణ ఛార్జీలు వినియోగదారునికి భారం కాకుండా చూడాలన్నారు. నోటిఫై చేసిన ఇసుక రవాణ ధరలకంటే.. ఎక్కువ వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక సరఫరా.. ఎదురవుతున్న సమస్యలపై ప్రతి రోజూ ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలన్నారు.