NTV Telugu Site icon

CM Chandrababu: ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశం

Chandrababu

Chandrababu

CM Chandrababu: కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు నానా పాట్లు పడుతున్నారు. పంట చేతికొచ్చి దానిని అమ్ముకునే సమయంలో వర్షాలు అన్నదాతలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది. ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యపు రాశులను వర్షాలకు తడవకుండా సమీప రైస్‌ మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అవసరమైన టార్ఫాలిన్లను రైతులకు సమకూర్చాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు పడే సమయంలో రైతులెవరూ పంట కోయకుండా వ్యవసాయ శాఖ సూచనలను రైతులందరూ పాటించే విధంగా చూడాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read Also: Ponnam Prabhakar : గురుకులాలపై సమీక్షించిన మంత్రి పొన్నం.. కీలక ఆదేశాలు