ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిన నేపథ్యంలో తొలిసారిగా మంత్రివర్గం సమావేశం కానుంది. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో వాగ్దానాల అమలు, రాష్ట్ర రాజధాని, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎనిమిది శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి..
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ..(వీడియో)
Show comments