NTV Telugu Site icon

CM Chandrababu: అమరావతిలో గ్లోబల్‌ మెడ్‌సిటీ.. వైద్యం, ఆరోగ్యంపై సీఎం పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో గ్లోబల్‌ మెడ్‌సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వైద్యం, ఆరోగ్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎం.. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు.. వివిధ వ్యాధులపై వివరణ ఇచ్చారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని నియోజకవర్గాల్లో 100 పడకల ఆసుపత్రి ఉంటుంది.. దేశంలో ఉన్న అత్యుత్తమ నిపుణులు క్యాన్సర్ హార్ట్ కు సంబంధించి చికిత్సలు జరుగుతాయన్నారు.. అమరావతిలో గ్లోబల్ మెడ్‌సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని.. ప్రతీ నియోజక వర్గంలోనూ 100 – 300 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేస్తున్నాం అన్నారు.. కుప్పం లో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ ను ఏర్పాటు చేశాం.. చాలా ఆస్పత్రుల నుంచే వ్యాధులు ఇతర రోగులకు వ్యాపిస్తున్నాయి.. దీనికి చెక్ పెట్టేలా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు..

Read Also: MLA Medipally Sathyam: కేసీఆర్ రాములవారిని అవమానించారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

గుండె జబ్బులు, డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు కొన్ని చోట్ల విస్తృతంగా పెరుగుతున్నాయి.. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్ టెన్షన్ కనిపిస్తోందన్నారు సీఎం చంద్రబాబు.. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉంది.. ఆహారం ఔషదం, వంటగదే ఔషధశాల అనే సూత్రాన్ని నేను బలంగా నమ్ముతాను.. అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.. ప్రభుత్వాలు ఆరోగ్యం పై చేసే వ్యయం తగ్గుతుందన్నారు.. మన ఆరోగ్యం మన చేతుల్లో నే ఉంటుందన్నది వాస్తవమని స్పష్టం చేశారు.. త్వరలోనే ఏపీ వ్యాప్తంగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తాం.. ప్రస్తుతం పైలట్ గా డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ ను కుప్పంలో చేశాం.. త్వరలో చిత్తూరు జిల్లాలో చేయబోతున్నాం.. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ తయారు చేస్తాం.. త్వరలో పిల్లల హెల్త్ రికార్డు లను కూడా డిజిటల్ లాకర్ లో పెడతాం.. ఏపీలో అందరికీ ఆభా ఐడీ కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.

Read Also: Karnataka Minister: పెద్ద నగరాల్లో లైంగిక దాడులు సహజం..! వివాదంలో మంత్రి..

రియల్ టైంలోనే ప్రజల ఆరోగ్యం పర్యవేక్షించాలని భావిస్తున్నాం.. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ వాహనం ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు చేస్తుందన్నారు సీఎం చంద్రబాబు.. మొత్తం 27 పరీక్షలు మొబైల్ వ్యాన్ ద్వారా నిర్వహించేందుకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేశాం.. ఈ వ్యవస్థల రూపకల్పనకు టాటా సంస్థతో పాటు, బిల్ గేట్స్ ఫౌండేషన్, ఏపీ మెడ్ టెక్ పార్క్ సహకరిస్తాయి.. జూన్ 15 నాటికి కుప్పంలో హెల్త్ నర్వ్ సెంటర్ ప్రారంభిస్తామని తెలిపారు.. ప్రతీ నియోజక వర్గంలో 100 పడకల తో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. అవసరం అయితే వయబిలిటి గ్యాప్ ఫండింగ్ కూడా ఇస్తాం. రాష్ట్రంలో ప్రభావితం చేస్తున్న 10 ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక అధికారులను నియమిస్తాం.. క్యాన్సర్ కు ఇప్పటికే డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ను నియమించాం.. హెల్తీ వెల్థీ హ్యాపీ ఏపి మా ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నాం.. అమరావతిలో మెగా గ్లోబల్ మెడ్‌సిటీ ప్రాజక్టు చేపట్టాలని భావిస్తున్నాం.. కేంద్రం దేశ వ్యాప్తం గా 25 గ్లోబల్ మెడ్‌సిటీలను పీపీపీ విధానంలో చేపట్టాలని నిర్ణయించింది.. మొత్తం 100 ఎకరాల్లో ఈ గ్లోబల్ మెగా మెడ్‌సిటీని నిర్మిస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..