Site icon NTV Telugu

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్… విశాఖలో మంత్రి లోకేష్ కీలక పర్యటన

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ బిజీ షెడ్యూల్‌తో అమరావతిలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు, అక్కడ ప్రభుత్వ పరిపాలనా అంశాలపై సమీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబుతో అమెరికా కాన్సులేట్ జనరల్ లౌరా విలియమ్స్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు, విద్యా, వాణిజ్య రంగాల్లో సహకారం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.

YS Jagan: భవానీపురం జోజీ నగర్ బాధితులకు పరామర్శ.. నేడు విజయవాడకు మాజీ సీఎం వైఎస్ జగన్..!

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ కార్యకలాపాలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతంపై నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు మంగళగిరిలోని 6వ బెటాలియన్‌కు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. అక్కడ కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్ల ట్రైనింగ్ సన్నాహక కార్యక్రమంలో పాల్గొని, పోలీస్ వ్యవస్థ బలోపేతం, శిక్షణ ప్రమాణాలపై కీలక సందేశం ఇవ్వనున్నారు.

Python Spotted in Drainage: డ్రైనేజీలో భారీ కొండ చిలువ.. పరుగులు తీసిన స్థానికులు

ఇదిలా ఉండగా.. మరోవైపు విశాఖపట్నంలో నేడు మంత్రి నారా లోకేష్ పర్యటన జరగనుంది. భోగాపురంలో జీఎంఆర్ మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్‌ను ఆయన లాంచ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ (AAD) ఎడ్యుసిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. విమానయాన రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఈ AAD ఎడ్యుసిటీ, భవిష్యత్తులో దేశానికి అవసరమైన సాంకేతిక నిపుణులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం భావిస్తోంది.

Exit mobile version