Land Pass Books: ఏపీ రైతులకు శుభవార్త.. రేపు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉదయం 11:20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బనగానపల్లెకు చేరుకుంటారు.
అక్కడ నుండి ఉదయం 11:40 గంటలకు బనగానపల్లె తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని, స్థానిక ప్రజలు, వివిధ వర్గాల రైతన్నలతో నేరుగా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ‘ప్రజావేదిక’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా పంపిణీ చేయనున్నారు.
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2:35 గంటలకు బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, స్థానిక పరిణామాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేసిన అనంతరం, సాయంత్రం 4:20 గంటలకు బనగానపల్లె నుండి తిరిగి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి సీఎం చంద్రబాబు బయల్దేరుతారు.
ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని నంద్యాల జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ బనగానపల్లెలో భారీ బందోబస్తుతో పాటు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాయి. నియోజకవర్గ నేతలు కూడా ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు