CM Chandrababu: ఖాదీసంత గాంధీ ఆశయాలకు ప్రతీక అని సీఎం చంద్రబాబు అన్నారు.. మహాత్మాగాంధీ అంటే గుర్తొచ్చేది ఖద్దర్ అన్నారు.. స్వాతంత్రోద్యమ స్ఫూర్తి రాట్నమే అని గుర్తు చేశారు.. తిండిపెట్డే రైతును గుర్తుపెట్టుకోవాలని లాల్ బహాదుర్ శాస్త్రి చెప్పినట్లు గుర్తు చేశారు. వారానికి ఒకరోజు సంతకు వెళతాం.. గ్లోబల్ సంతగా ఖాదీసంత తయారవుతుందనడానికి అనుమానం లేదు.. విదేశీ వస్త్రాలు, విదేశీ వస్తువులు అప్పుడు బహిరంగంగా తగులబెట్టారు.. అన్నిరకాల విలువలు కలిగిన దేశం భారతదేశం.. మనం ఎంత ఎదిగినా మన మూలాలు మర్చిపోకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. 60% విదేశీ మార్కెట్ మనదగ్గర జరిగేదన్నారు.. పివి నరసింహారావు మొట్టమొదటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ఆర్థిక సంస్కరణలకు వాజ్ పేయి వచ్చాక జవసత్వాలిచ్చారని గుర్తు చేశారు. అమెరికా కంటే మెరుగైన రోడ్లు భారతదేశంలో ఉండటానికి కారణం వాజ్ పేయి.. అప్పట్లో ఎంఎల్ఏకి అప్పట్లో ఒక జీప్ మూడు టెలిఫోన్ లు ఇచ్చేవారు. సెల్ ఫోన్ లేకపోతే ఇప్పుడు ఎవరూ ఉండలేరని సీఎం చంద్రబాబు అన్నారు.. భార్య భర్త లేకపోతే ఉంటుంది.. భర్త భార్య లేకపోతే ఉంటారు కానీ సెల్ ఫోన్ లేకపోతే ఉండలేరు.. అంటూ సీఎం హాస్యోక్తి విసిరారు.
READ MORE: Baa Baa Black Sheep : ఆసక్తికరంగా ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్
అమరావతి ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఖాదీ సంత కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. క్రీడాకారిణి పీవీ సింధుకు అగ్గిపెట్టలో చీర బహూకరించారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. “వంద దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చి ప్రధాని మోడీ ఆ దేశాల ప్రాణాలు కాపాడారు. మూలాలు మర్చిపోవడం లేదు… భవిష్యత్తు వదిలిపెట్టడం లేదు.. ప్రధాని మోడీ… మాకొక స్వయం ప్రతిపత్తి ఉంది.. మా నిర్ణయాలు మేం తీసుకోగలం అని చెప్పారు మోడీ.. స్పేస్ సిటీ పెట్టి ప్రైవేట్ సెక్టార్ లో శాటిలైట్ లు మనం ఇవ్వబోతున్నాం. రాబోయే రోజుల్లో అన్ని దేశాలకు ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో తయారుచేసే అన్ని వస్తువులు ఇక్కడ ఖాదీసంతలో పెట్టారు. ప్రపంచాన్ని యాచించే పరిస్ధితి నుంచీ శాసించే పరిస్ధితికి రావాలి. 160 కోట్లకు జనాభా పెరుగుతుంది.. జనాభా అనేది ఈరోజుల్లో అతిపెద్ద ఆస్తి.. ఈ ప్రపంచంలో ఎవరికంటే మన భారతీయులు తక్కువ కాదు. మన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు వస్తాయి. కళలను ఆదుకుంటాం.. అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తాం.. ప్రధానికి అరకు కాఫీ ఇచ్చాను.. ఆ తరువాత ప్రధాని అన్ని చోట్లా అరకు కాఫీ గురించి చెప్పారు.. వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్.. అని నేను చెప్పాను.. జీఎస్టీ ని సరళీకృతం చేసి 5, 18 శ్లాబ్ లకు తీసుకొచ్చారు.. సంస్కరణలు అన్నీ సామాన్యుడికి చేరాలి.. సంకల్పం చేస్తే.. సాధించే రోజు వస్తుంది..” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
