CM Chandrababu: ఏపీలో రేపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లా కూటమికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో మాట్లాడారు. రేపు ప్రధాని శ్రీశైలం, కర్నూలు పర్యటనలను గ్రాండ్ సక్సెస్ చేద్దాం.. డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని వెల్లడించారు. కేంద్ర సహకారంతో అనేక పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున లాభం చేకూరుతోంది.. ఏపీలో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో నిన్న గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ఇది చారిత్రాత్మక నిర్ణయం అని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: Maganti Sunitha: బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు..!
ఇక, 1998లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రాకతో ఐటీ ఎకో సిస్టం ఏర్పడి.. నాలెడ్జి ఎకనామీకి పునాది పడింది అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీకి గూగుల్ డేటా హబ్ రావటంలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్ చొరవ ఉంది.. గూగుల్ రావడానికి ఐటీ మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పోషించారు.. అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ ప్రతినిధులతో సంప్రదించి రాష్ట్రానికి వచ్చేలా చేశాం.. అతిపెద్ద ఏఐ డేటా హబ్ ఏర్పాటుకు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ముందుకు వచ్చింది.. దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టుబడి అని చంద్రబాబు కొనియాడారు.
Read Also: Hamas-Trump: ట్రంప్ హెచ్చరికలు లెక్క చేయని హమాస్.. తాజాగా 8 మంది బహిరంగ కాల్చివేత
అయితే, రాష్ట్ర విభజనతో ఎదుర్కోన్న ఇబ్బందుల కంటే గత పాలకులు చేసిన విధ్వంసంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. పాలనా పరంగా అనేక తప్పులు చేశారు…వాటిని సరి చేయడానికే చాలా సమయం పట్టింది.. యోగాంధ్ర, అమరావతి రీస్టార్ట్ లాంటి కార్యక్రమాలను విజయవంతం చేశాం.. ఇప్పుడు ప్రధాని మోడీ పాల్గోనే సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.. జీఎస్టీ 2.0 సంస్కరణలతో ఒక్కో కుటుంబానికి రూ.15 వేలు ఆదా అవుతుంది.. నెక్స్ జెన్ సంస్కరణలపై నెల్లాళ్లుగా విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Dhanteras 2025: ధన త్రయోదశి రోజున బంగారం కొనేందుకు శుభసమయం ఇదే.. ఇక లక్ష్మీదేవి మీవెంటే!
అలాగే, రాయలసీమకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సీమ జిల్లాలు ఉద్యావన పంటలకు కేంద్రంగా మారాయి.. రాష్ట్రంలో పోర్టులు, రైల్వేల కనెక్టివిటీ ద్వారా సంపద సృష్టి జరుగుతుంది.. గత పాలకులు సీమలోని సాగునీటి ప్రాజెక్టులకు కనీసం 2 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు.. రాయలసీమ టూరిజం డెస్టినేషన్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి, శ్రీశైలం, గండికోట లాంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నాం.. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ సాధనే లక్ష్యంగా మనం అంతా పని చేయాలని సూచించారు. రేపు కూడా ప్రధాని రూ.13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని నారా చంద్రబాబు తెలియజేశారు.
