Pawan Kalyan Vs Bonda Uma: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం ప్రతిపక్షం లేకపో యినా.. కూటమి పార్టీల మధ్యే హీట్ పుడుతోంది.. స్టిక్ కాలుష్యం పై అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో చర్చ జరిగింది.. సాధారణంగా క్వశ్చన్ అవర్‌లో ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తుంటారు.. ఒక్కోసారి సభ్యులు అసంతృప్తికి గురైన పరిస్థితి కూడా ఉంటుంది.. ఈ మధ్య కాలంలో ఇదే సెషన్ లో ఇలాంటి పరిస్థితి కొనసాగుతోంది.. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి ఇదే రకమైన చర్చ అసెంబ్లీలో జరిగింది.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వ్యవహారానికి సంబంధించి చైర్మన్ పనితీరు బాలేదని ఎమ్మెల్యే బొండా ఉమా కామెంట్ చేశారు.. దాంతోపాటు పవన్ కల్యాణ్ అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని పనులు కావట్లేదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ చెప్తున్నారు అన్నారు.. బొండా ఉమ… ఈ వ్యాఖ్యలని తప్పు పట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తాను అందుబాటులో ఉండడం లేదనే మాట వాస్తవం కాదు అన్నారు… అయితే పొల్యూషన్ కంట్రోల్ విషయంలో తగిన చర్యలు తీస్కుంటాము అన్నారు పవన్..
Read Also: AP Assembly : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి.. బోండా ఉమా వ్యాఖ్యలపై తీవ్ర స్పందన!
తాజాగా ఈ అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది.. బోండా ఉమా బెదిరింపు ధోరణిలో మాట్లాడారని ఈ అంశం మీద డీటెయిల్ గా ఎంక్వైరీ చేయాలని చెప్పారు పవన్… అసలు బోండా ఉమా ప్రస్తావిస్తున్న క్రేవ్‌స్ సంస్థలకు సంబంధించి విధివిధానాలు ఏ రకంగా ఉన్నాయి ..ఆ సంస్థ యాక్టివిటీస్ కు సంబంధించి కూడా డీటెయిల్ గా ఎంక్వయిరీ చేయమన్నట్టు సమాచారం.. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ వ్యవహార శైలి.. బొండా ఉమా ఏ ఉద్దేశంతో చైర్మన్ మీద కామెంట్ చేశారు.. ఇవన్నీ డీటెయిల్ గా శాఖ పరంగా విచారణ చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో పవన్ అందుబాటులో లేరు అని మాట్లాడటం అనే విషయాన్ని ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది… జనరల్ గా ఎమ్మెల్యే అధికారుల మీద సీరియస్ అవ్వటం లేకపోతే అధికారులు పనిచేయడం లేదని చెప్తూ ఉంటారు.. కానీ డిఫరెంట్ స్టైల్‌లో పవన్ కల్యాణ్ అందుబాటులో లేరని చెప్పడంతో సీరియస్ అయ్యారు పవన్.
ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా పవన్ కల్యాణ్ తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు.. అయితే, ఆల్రెడీ సీఎంవో విచారణ చెయ్యాలని కూడా పవన్ కల్యాణ్ చెప్పినట్టు తెలిసింది.. సీఎం చంద్రబాబు కూడా బొండా ఉమా వ్యవహార శైలిపై సీరియస్ అయినట్టుగా తెలిసింది.. బోండా ఉమా కామెంట్స్ కి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వ్యవహారం సంస్థకు సంబంధించిన అంశాలపై కూడా విచారణ జరగనుంది… రాంకి క్రేవ్స్.. సంస్థ విజయవాడ సెంట్రల్ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమ ఏర్పాటు చేయదల్చుకుంది.. ఎమ్మెల్యే బొండా ఉమా ఈ సంస్థ ప్రతినిధులను పిలిచి మాట్లాడినట్టు సమాచారం… ఆర్ధిక లావాదేవీలు అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది.. ఎమ్మెల్యే దగ్గర విషయం సెటిల్ కాకపోవడంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కి ఎమ్మెల్యే అనుచరులు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.. తర్వాత సంస్థ ప్రతినిధులు ఇష్యూ ఎమ్మెల్యే దగ్గర సెటిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది… ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు.. ఎమ్మెల్యే బెదిరింపు ధోరణితో మాట్లాడడం సరికాదని పవన్ అధికారులతో వ్యాఖ్యానించారు.. సీఎం చంద్రబాబు కూడా బోండా ఉమా వ్యాఖ్యల మీద సీరియస్ అయినట్టుగా సమాచారం.
బహుశా టీడీపీ అధిష్టానం నుంచి కూడా బోండా ఉమాకి పిలుపు వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.. గత కొన్ని రోజులుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. ఉమా అనుచరులు చేస్తున్న కార్యక్రమాలు అన్నింటి మీద కూడా పూర్తిస్థాయి నివేదిక సీఎం దగ్గర ఉందట.. ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ జరగడంతో బోండా ఉమా వైఖరి మీద మరింత సీరియస్ గా ఉన్నట్టు సమాచారం… సీఎం బోండా ఉమాని.. పిలిపించి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. మరోవైపు జనసేన కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది.. శాఖ పరమైన విచారణ జరిగిన తర్వాత పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది.. కూడా హాట్ టాపిక్ గా మారింది.. ఉద్దేశపూర్వకంగానే బోండా ఉమా ఇలా మాట్లాడారా లేకపోతే నిజంగా పొల్యూషన్ ఎక్కువైపోతుందా.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని… ప్రశ్నించారా.. అనే అంశం పై కూడా విచారణలో తేలనుంది.
