Site icon NTV Telugu

CM Chandrababu: నేడు మూడు జిల్లాల పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ..!

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మూడు జిల్లాల్లో కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్‌లో నిర్వహించనున్న జీఎఫ్ఎస్‌టీ టూరిజం కాంక్లేవ్‌లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక రంగ అభివృద్ధిపై అధికారులు, పరిశ్రమ ప్రతినిధులతో సీఎం మాట్లాడనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు గుంటూరు బయలుదేరి చంద్రబాబు, సాయంత్రం 3 గంటలకు ఆర్‌వీఆర్ అండ్ జేసీ కాలేజీలో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పై ఆయన దృష్టి సారించారు.

Read Also:Pink Elephant : సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

తర్వాత సీఎం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చేరుకుని జిందాల్‌ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను పసిలినా చేయనున్నారు. మున్సిపల్‌ వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే విధానాలను ఆయన పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. చివరగా చంద్రబాబు సాయంత్రం 5.45 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. ఈ రోజు మొత్తం సీఎం మూడు జిల్లాల్లో పర్యటిస్తూ.. పర్యాటకం, టెక్నాలజీ, పరిశ్రమ రంగాల్లో వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా గడపనున్నారు.

Read Also:Jasprit Bumrah: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రా దూరం!

Exit mobile version