Site icon NTV Telugu

CM Chandrababu: లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటించిన సీఎం!

Cm Chandrababu

Cm Chandrababu

నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామం ఘటనలో చనిపోయిన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు పరిహారం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాద్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌లకు కూడా పరిహారం ఇవ్వనున్నారు. శాంతిభద్రతలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు అనిత, నారాయణ సహా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

సమీక్ష సందర్భంగా కందుకూరులో జరిగిన లక్ష్మీనాయుడు హత్యను సీఎం చంద్రబాబు ఖండించారు. ఈ ఘటన అమానుషం, అమానవీయం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. లక్ష్మీ నాయుడు హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్షపడాలని ఆదేశించారు. ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై వేగంగా దర్యాప్తు చేయాలని మంత్రులకే చెప్పారు. లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారం ఇవ్వాలని చెప్పారు. ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాటిజ్ చేయాలని సీఎం ఆదేశించారు.

Also Read: AP Weather Update: ఏపీకి వాయుగుండం ముప్పు.. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు!

కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌కు కూడా పరిహారం అందించాలని సీఎం చెప్పారు. పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని సీఎం తెలిపారు. భార్గవ్‌కు రూ.3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని ఆదేశించారు. లక్ష్మీ నాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించారు. కోర్టులో కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

Exit mobile version