Site icon NTV Telugu

Cluster Beans Cultivation: గోరు చిక్కుడు సాగులో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Cluster

Cluster

మనం తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా పండిస్తున్న పంటలలో గోరు చిక్కుడు కూడా ఒక్కటి..అన్నీ వాతావరణ పరిస్థితులు వద్ద పెరుగుతాయి.. ఈ పంట సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. అధిక సాంద్రత గల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.5 మధ్య గల నేలలు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల గోరుచిక్కుడు గింజల నుంచి జిగురు తయారు చేసి ఈ జిగురును బట్టలు, పేపరు, నూనెల తయారీలో వాడతారు.. ఈ పంటకు అనువైన రకాలు, కోతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

గోరుచిక్కుడు లో రకాలు?

పూసాసదాబహార్‌ : ఖరీఫ్‌, వేసవి పంటలకు అనువైనది. గింజ విత్తిన 45-50 రోజులకే మొదటి కోతకు వస్తుంది. కాయలు 12-13 సెం.మీ. పొడవు ఉంటాయి. మొక్క కొమ్మలతో ఉంటుంది.

పూసానవబహార్ : దీని కాయలు పూసా మౌసమిలా ఉంటాయి. మొక్క కొమ్మలు లేకుండా ఉంటుంది. ఖరీఫ్‌, వేసవి పంటలకు అనువైన రకం.వీటితో పాటు కొన్ని ప్రయివేట్ రకాలు కూడా కొన్ని ఉన్నాయి.. వీటితో పాటుగా పూసా మౌసమి.. ఖరీప్‌ పంటకు అనువైనది. గింజ విత్తిన 70-80 రోజులకు మొదటి కోతకు వస్తుంది..

గోరు చిక్కుడును జనవరి రెండో వారం నుంచి పిభ్రవరి వరకు విత్తుకోవచ్చు.. ఇక ఎరువులు పశువుల ఎరువు మంచిది..ఎకరాకు 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వేసుకోవాలి. సగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్‌నిచ్చే ఎరువులను ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజని విత్తిన 30-40 రోజులకు వేసుకోవాలి.. ఇక పోతే విత్తిన 3 రోజులకు నీళ్లను కట్టాలి… ఆ తర్వాత కాయలను కోస్తున్న తర్వాత వారానికి ఒకసారి నీటిని ఇవ్వాలి..

తెగుళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి..పేనుబంక, చిన్న, పెద్ద పురుగులు లేత చిగుళ్ళు, ఆకుల నుండి రసం పీల్చి నష్టం కల్గిస్తాయి. వీటి నివారణకు డైమిథోయేట్‌ లేదా ఫాసలోన్‌ లేదా ఫిప్రోనిల్‌ల లోని ఏదేని ఒక మందును 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలి… అప్పుడే తెగుళ్ల నుంచి బయట పడవచ్చు..ఈ పంట గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే దగ్గరలోని వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..

Exit mobile version