Exam Hall: అసలే మ్యాథ్స్ ఎగ్జామ్ చాలా కష్టం.. నైటంతా కూర్చుని బాగా ప్రాక్టీస్ చేశాడు.. ఎగ్జామ్ మంచిగా రాయాలని పట్టుమీద ఉన్నాడు.. అదేసమయంలో మర్చిపోతానేమోనని భయంభయంగా ఉన్నాడు. డౌట్ డౌట్ గానే ఎగ్జామ్ హాల్లో అడుగుపెట్టాడు.. అక్కడ సీన్ చూసి షాక్ అయ్యాడు.. దీంతో స్పృహ తప్పిపోయాడు. అసలు విషయం ఏంటంటే మనోడికి అమ్మాయిలంటే భయం అనుకుంటా.. ! వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని నలందాలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థి.. ఎగ్జామ్ హాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న అమ్మాయిలను చూసి హాల్‌లోనే స్పృహతప్పి పడిపోయాడు. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు.
Read Also: Fire Accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
మనీశ్ శంకర్ అనే విద్యార్థి అల్లామా ఇక్బాల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. మనీశ్‌ను పరీక్ష రాసేందుకు అతడి తండ్రి సచ్చిదానంద్ ప్రసాద్ సుందర్‌గఢ్‌లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్‌కు తీసుకొచ్చాడు. బుధవారం షెడ్యూల్ ప్రకారం గణిత పరీక్ష జరగనుంది. పరీక్ష రాసేందుకు మనీశ్ హాల్‌లోకి వెళ్లాడు. పరీక్ష హాల్‌లో ఉన్న బాలికలను చూసి విద్యార్థి ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయాడు. ఒకేసారి అంత మంది విద్యార్థినులను చూడగానే మనీశ్ కంగారుపడి స్పృహ తప్పిపోయాడని అతడి మేనత్త వెల్లడించారు.
