Site icon NTV Telugu

Himachal Pradesh: ముస్లిం అబ్బాయితో కలిసి పారిపోయిన హిందూ అమ్మాయి..చివరికీ..

Himachal’

Himachal’

హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రం సిర్మౌర్‌లోని పాంటా సాహిబ్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇక్కడ ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయితో పారిపోవడంతో ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో పోలీసులతో సహా 10 మంది గాయపడ్డారు. ఈ అంశంపై పాంట సాహిబ్ పట్టణంలో హిందూ సంస్థలు 4 రోజులుగా నిరసన తెలుపుతున్నాయి. వారు దీనిని లవ్ జిహాద్ కేసుగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ముస్లిం యువకుడితో పారిపోయిన అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు. 19 ఏళ్ల ముస్లిం యువకుడితో యువతి పారిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

READ MORE: Madhubala : కొన్ని పాత్రల కోసం నా రూల్స్ నేనే బ్రేక్ చేసుకున్న..

కాగా.. శుక్రవారం, స్థానిక హిందూ సంస్థల సభ్యులతో కలిసి కుటుంబీకులు నిరసనకు దిగారు. కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, నహాన్ నుండి 25 కి.మీ దూరంలో ఉన్న మజ్రా వద్ద నహాన్-పావోంటా రహదారిని దాదాపు గంటసేపు దిగ్బంధించారు. కొందరు గుంపుగా ఏర్పడి ఆ ముస్లిం యువకుడి ఇంటి వైపునకు వెళ్లారు. దీంతో అవతలి వైపు నుంచి రాళ్ల దాడి ప్రారంభమైంది. ఆ తర్వాత నిరసనకారులు కూడా రాళ్లు రువ్వారు. నిరసన కాస్త ఘర్షణగా మారింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రాళ్ల దాడిని ఆపడానికి బలప్రయోగం చేయాల్సి వచ్చింది.

READ MORE: Ashwini Sri : మా అక్కను పెళ్లి చేసుకుంటే నేనూ వచ్చేస్తా.. హీరోకు అశ్విని శ్రీ ఆఫర్..

Exit mobile version