Bolivia Clashes : బొలీవియాలో బీభత్సం కొనసాగుతోంది. స్థానిక గవర్నర్ అరెస్టును ఖండిస్తూ ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపై పేలుడు పదార్థాలు విసిరారు. కొత్త ఏడాదికి ముందు రోజు హింసాత్మక పరిస్థితులు బొలీవియాలో నెలకొన్నాయి. గవర్నర్ లూయిస్ ఫెర్నాండో కమచో అరెస్టును నిరసిస్తూ ఆయన మద్దతుదారులు శాంటా క్రూజ్ సిటీలో ఆందోళనకు దిగారు. వాళ్లను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది.
Read Also: Elephant Gift To Dancing Girl: పాప డ్యాన్స్‌కు ఫ్యాన్ అయిన ఏనుగు.. గిఫ్ట్ గా ఏం ఇచ్చిందంటే..
లూయిస్ ఫెర్నాండో కమచో ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఫెర్నాండోకు స్థానిక కోర్టు జడ్జి సెర్గియో పచెకో నాలుగు నెలల ప్రి-ట్రయల్ శిక్ష విధించారు. అతడిని రాజధాని లాపేజ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైలుకు తరలించాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. దాంతో, ఫెర్నాండోను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. లాపేజ్ పోలీస్ స్టేషన్ నుంచి వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరైన ఆయన ‘బొలీవియాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తాను ఈ పోరాటాన్ని విరమించను’ అని తెలిపాడు. అరెస్టును వ్యతిరేకిస్తూ వందలాది మంది రోడ్ల మీదకు వచ్చారు. పోలీసు స్టేషన్‌పై రాళ్లు రువ్వారు. టైర్లు కాల్చడమే కాకుండా పోలీసులపైకి పేలుడు పదార్థాలు విసిరారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశారు.
