NTV Telugu Site icon

Munugodu Congress : మునుగోడు కాంగ్రెస్‌లో ముసలం

Munugode

Munugode

తెలంగాణలో ఎన్నికల వేళ ఆయా పార్టీలు బరిలోకి దించే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. దీంతో.. మునుగోడు కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. తనకు మునుగోడు టికెట్ రాకపోవడంతో కార్యకర్తలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు పీసీసీ కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి. భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చలమల్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో ముసలోల్లదే నడుస్తుందని, తనకు టికెట్ రాకుండా నల్గొండ పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాల్వాయి స్రవంతి అడ్డుకున్నారని ఆరోపించారు.

అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ పార్టీ కి క్యాన్సర్ లాంటి వాళ్ళు కోమటి రెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి వర్గం కాబట్టి జిల్లా సీనియర్లు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. టికెట్ సర్వే ఆధారంగా వస్తంది అనుకున్న. కాంగ్రెస్ పార్టీ లో ఎదగాలంటే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ లు పెట్టాలి. ఢిల్లీ నాయకుల కాళ్ళు మొక్కాలి. నాయకులకు మొక్కులు చెల్లించాలి. 15 నెలల కింద కాంగ్రెస్ జెండా కింద పడేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ లో వుండి బిజెపి కి ఓట్లు వేయించింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వెంకట్ రెడ్డి కుళ్ళు రాజకీయం వల్లనే నాకు టికెట్ రాలేదు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే వెంకట్ రెడ్డి కూడా బీజేపీ పార్టీ లోకి వెళ్ళేవాడు.

 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో మంది నాయకులను రోడ్డు పై పడేసి వాళ్ళ రక్తం తాగుతున్నాడు. వాళ్ళ డబ్బుల తో దానధర్మాలు చేస్తున్నావ్. మీకు, మీ కుటుంబ సభ్యులకు రెండేసి టిక్కెట్లు కావాలి.. వేరే వాళ్ళు మీముందు ఎదగవద్దు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తల పై కేసులు పెట్టించిన చరిత్ర రాజగోపాల్ రెడ్డిది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పెద్దలకు చెబుతున్న ఇప్పటికైనా మీ సీట్లను త్యాగం చేసి బీసీ నాయకులకు టిక్కెట్లు ఇవ్వండి. మొదటి జాబితాలో మొదటి పేరు వున్న నన్ను ఇప్పుడు పేరు లేకుండా చేశారు. సేవ్ మునుగోడు నినాదంతో ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తాను.’ అని చలమల కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.