Site icon NTV Telugu

Clash in school over hijab: స్కూల్‌లోనూ హిజాబ్‌ వివాదం.. రెండు వర్గాల మధ్య ఘర్షణ, పరీక్షలు రద్దు

Hijab Row

Hijab Row

Clash in school over hijab: కర్ణాటకను కుదిపేసిన హిజాబ్‌ వివాదం ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ను తాకింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలోని ఒక పాఠశాలలో హిజాబ్, నామబలి(కాషాయ వస్త్రాలు) ధరించ రెండు గ్రూపుల విద్యార్థుల మధ్య జరిగిన గొడవ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. హౌరాలోని ధులాగఢ్‌లోని ఒక పాఠశాలలో తరగతి గదిలో హిజాబ్ ధరించడానికి ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా ఓ గ్రూపు సభ్యలు కాషాయ కండువాలు ధరించి వచ్చింది. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. విద్యార్థులు పాఠశాల ఆస్తులను కూడా ధ్వంసం చేశారు.

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 100 ఇళ్లు, దుకాణాలు దగ్ధం

పరిస్థితి అదుపు తప్పడంతో పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే పోలీసు సిబ్బందిని, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)ను సంఘటనా స్థలానికి రప్పించారు. వివాదం కారణంగా 11, 12వ తరగతుల పరీక్షలను స్కూలు యాజమాన్యం రద్దు చేసింది. ఆ తర్వాత సమావేశమైన స్కూలు మేనేజ్‌మెంట్ కమిటీ.. స్కూలు యూనిఫాంతో వస్తే తప్ప తరగతి గదుల్లోకి విద్యార్థులను అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. హిజాబ్ ధరించి స్కూలుకు రావడాన్ని టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా సమర్థించారు. సిక్కు వ్యక్తి హెల్మెట్‌కు బదులుగా తలపాగా ధరించడం రాజ్యాంగ ఉల్లంఘన కానప్పుడు ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించి రావడాన్ని ఎలా వ్యతిరేకిస్తామని ప్రశ్నించారు. అలాగే, కాషాయ వస్త్రాలు ధరించి వస్తే కూడా వ్యతిరేకత ఉండకూడదన్నారు. కానీ, బీజేపీ మాత్రం దీనిని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి అగ్నిమిత్ర పాల్ మాట్లాడుతూ.. విద్యాసంస్థలు డ్రెస్ కోడ్ పాటించాలని సూచించారు.

Exit mobile version