NTV Telugu Site icon

Clashes in Macharla: మాచర్లలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ

Macharla Fight

Macharla Fight

Clashes in Macharla: పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నిర్వహిస్తున్న రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణుల యత్నించడంతో ఈ గొడవ ప్రారంభమైంది. మాజీ ఛైర్మన్ తురకా కిషోర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో నేడు జూలకంటి బ్రహ్మరెడ్డి అధ్వర్యంలో టీడీపీ ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. కర్రలతో టీడీపీ వారిపై దాడి చేశారు. టీడీపీ శ్రేణులు వారిపై తిరగబడడంతో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి.

Lady Fingers : అమ్మాయిలూ.. నానబెట్టిన బెండకాయ నీటితో ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ గొడవలో కొందరికి గాయాలు అయినట్లు సమాచారం. వారిని ఆసుపత్రికి తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో ఈ గొడవ సద్దుమణిగింది. మళ్లీ గొడవలు జరగొచ్చనే అనుమానంలో పోలీసులు ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

Show comments