NTV Telugu Site icon

TDP vs YCP: టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. బనగానపల్లెలో ఉద్రిక్తత!

Tdp Vs Ycp

Tdp Vs Ycp

టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణతో నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు వైసీపీ నేత అబ్దుల్ ఫయాజ్ కుమారుడి వివాహంలో వీరంగం సృష్టించారు. వివాహ వేడుకలను డ్రోన్‌ కెమెరాతో షూట్ చేస్తున్న ఆపరేటర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అబ్దుల్ ఫైజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పీఎస్ ముందు మాజీ ఎమ్మెల్యే కాటసాని ధర్నాకు సిద్ధమయ్యారు.

శివనంది నగర్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసం సమీపంలో వైసీపీ నేత అబ్దుల్ ఫయాజ్ నివాసం ఉంది. అబ్దుల్ ఫయాజ్ కుమారుడి పెళ్లి నేపథ్యంలో డ్రోన్ సాయంతో షూట్ చేస్తున్నారు. మంత్రి నివాసంపై డ్రోన్ కెమెరా ఎగరడంను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. మంత్రి ఇంటిని షూట్ చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు అతి చేశారు. టీడీపీ కార్యకర్తలు డ్రోన్‌ కెమెరాలను ధ్వంసం చేశారు. తెల్లవారితే వివాహం జరగాల్సిన ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురిచేశారు. అయినా కూడా అక్కడే ఉన్న పోలీసులు ఏమీ పట్టనట్టు ఉన్నారు. ఈ ఘటనపై అబ్దుల్ ఫైజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టీడీపీ వర్గీయుల దాడికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, వైసీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కాటసాని పీఎస్ ముందు ధర్నాకు సిద్ధమయ్యారు.

Show comments