CJI DY Chandrachud: ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం సౌమ్యుల నైజం.. అది కొందరికే సాధ్యం.. అందులో ఒకరు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అని చెప్పాలి.. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో క్రింది స్థాయి చిరు ఉద్యోగి పట్ల చూపిన ఆత్మీయ పలకరింపు అందరిని ఆశ్చర్య చకితులను చేసింది. తిరుపతి, తిరుమలలో నిన్న, ఈ రోజు రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు సీజేఐ దంపతులు.. అయితే, మంగళవారం ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో న్యాయ శాస్త్ర దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అధితిగా సీజేఐ హాజరైయ్యారు.
Read Also: Ananya Nagalla: నాకు కాబోయే హస్బెండ్ ఆ హీరో లాగే ఉండాలి: అనన్య
ఈ సందర్భంగా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో తిరుపతిలో 3వ అదనపు సెషన్ జడ్జి దఫేదార్‌గా ఎం. దొరై రాజు అనే వ్యక్తి ప్రస్తుతం పని చేస్తున్నారు.. అయితే, సీజేఐ డీవై చంద్రచూడ్ తండ్రి.. అప్పటి సీజే వైవీ చంద్రచూడ్.. 1982 నుంచి తిరుమలకు అనేకసార్లు శ్రీవారి దర్శనం కోసం వస్తూ ఉండేవారు.. అప్పటి నుంచి తండ్రికి పరిచయం అయిన అతను తిరుపతికు వచ్చిన ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్‌కు కనిపించారు.. ఆ వెంటనే దఫేదార్ గురుంచి తన కుటుంబ సభ్యులకు పరిచయం చేసారు చీఫ్ జస్టిస్.. కుటుంబ సభ్యుల గురుంచి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. ఇలా సుమారు 5-10 నిమిషాలు ఒక చిన్న స్థాయి ఉద్యోగి పట్ల సీజేఐ చూపిన ఆప్యాయత మరువలేనిది అంటూ అక్కడనున్న రాష్ట్ర, హైకోర్ట్, జిల్లా జడ్జిలు, న్యావాదులు మంత్ర ముగ్ధులయ్యారు.