దుబాయ్ నగరం ఎత్తైన భవనాలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు దుబాయ్ మరో రికార్డును కూడా సొతం చేసుకోనుంది. ‘సీల్ దుబాయ్ మెరీనా’ నవంబర్ 2025లో ఓపెన్ కానుంది. ఈ హోటల్ 377 మీటర్ల ఎత్తు (1197 అడుగు) ఉంటుంది. హోటల్‌లో 82 అంతస్తులు ఉండగా.. 1,004 గదులు ఉంటాయి. ఇది ప్రపంచంలోనే ఎత్తైన హోటల్‌గా నిలవనుంది. ప్రస్తుతం ఎత్తైన హోటల్‌గా 356 మీటర్ల ఎత్తైన గెవోరా ఉంది. గెవోరా హోటల్‌ను వెనక్కి నెట్టి త్వరలో సీల్ దుబాయ్ మెరీనా అగ్రస్థానంలో నిలవనుంది.
సీల్ దుబాయ్ మెరీనా హోటల్ పూర్తిగా గాజుతో రూపొందించబడింది. పామ్ జుమైరా, అరేబియన్ గల్ఫ్ అద్భుతమైన దృశ్యాలను ఈ హోటల్ నుంచి వీక్షించొచ్చు. ఈ హోటల్‌లో ప్రపంచంలోనే ఎత్తైన ఇన్ఫినిటీ పూల్ ఉంటుంది. ఇది 77వ అంతస్తులో ఉంది. అడ్రస్ బీచ్ రిసార్ట్ 294 మీటర్ల పూల్‌ను ఇన్ఫినిటీ పూల్ బ్రేక్ చేయనుంది. ఈ హోటల్‌లో 7 రెస్టారెంట్లు, 61వ అంతస్తులో ఒక లగ్జరీ స్పా ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే అతిథులకు అత్యుత్తమ సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. ఇది ఇంటర్ కాంటినెంటల్ హోటల్స్ గ్రూప్ (IHG) విగ్నెట్ కలెక్షన్ బ్రాండ్ కింద రన్ కానుంది.
Also Read: Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?
సీల్ దుబాయ్ మెరీనా హోటల్ దుబాయ్ మెరీనా ఎంట్రీ వద్ద ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు మెరీనా బోర్డువాక్, షాపింగ్ మాల్, బీచ్, ట్రామ్-మెట్రోలను సులభంగా చేరుకోవచ్చు. పామ్ జుమేరా సహా అప్‌టౌన్ దుబాయ్ కూడా కొద్ది దూరంలోనే ఉంటాయి. నేల నుంచి పైకప్పు వరకు ఉన్న గాజు కిటికీలు అతిథులకు పర్షియన్ గల్ఫ్ 360 డిగ్రీల వ్యూను అందిస్తాయి. ఈ హోటల్ ద్వారా స్కైలైన్‌ను మరింత అందంగా తీర్చిదిద్దడమే కాకుండా.. ప్రపంచంలోని అగ్రశ్రేణి పర్యాటక, వ్యాపార గమ్యస్థానంగా దుబాయ్ నగరం గుర్తింపును మరోసారి రుజువుచేయనుంది.
