NTV Telugu Site icon

AP CID: లోకేష్‌ను అరెస్ట్‌ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్

Nara Lokesh

Nara Lokesh

AP CID: లోకేష్‌ను అరెస్ట్ చేయటానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను లోకేష్ ఉల్లంఘించినట్టు పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది. చంద్రబాబు కేసుల్లో దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని సీఐడీ తెలిపింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కేసుల్లో ఉన్న దర్యాప్తు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకి పంపిస్తామని లోకేష్ ప్రకటనలపై సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రెడ్ బుక్ పేరుతో చేస్తున్న ప్రకటనలు సీరియస్‌గా పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కోరింది.

Read Also: Gorantla Butchaiah Chowdary: ఇంట గెలవలేని వాడు రచ్చ గెలుస్తాడా.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు

ఐఆర్‌ఆర్‌ కేసులో గతంలోనే సీఐడీ లోకేష్‌కు 41ఏ కింద నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే 2 సార్లు లోకేష్ విచారణకు హాజరయ్యారు. ఐఆర్‌ఆర్‌ కేసులో ఏ14గా లోకేష్ ఉన్నారు. వాంగ్మాలాలు ఇవ్వడాన్ని లోకేష్ తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అధికారులు 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని.. రెడ్ బుక్‌లో పేర్లు రికార్డు చేశానని, తమ‌ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్‌ హెచ్చరించారు. 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియలో భాగం కాగా దీన్ని సైతం‌ లోకేష్ తప్పుబట్టడంపై న్యాయవర్గాలలో విస్మయం వ్యక్తమవుతోంది. సాక్షుల బెదిరించి కేసు దర్యాప్తుని పక్కదారి పట్టించాలని లోకేష్ ఉద్దేశంగా సీఐడీ పిటిషన్‌లో పేర్కొంది.