Site icon NTV Telugu

Inner Ring Road case: ఇన్నర్‌ రింగ్‌ రోడ్ కేసు.. నారా లోకేష్‌పై సీఐడీ ప్రశ్నల వర్షం..!

Lokesh

Lokesh

Inner Ring Road case: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసు ఏపీలో కాకరేపుతోంది.. ఈ రోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు.. ఈ కేసులో లోకేష్‌ను ఏ-14గా పేర్కొంది సీఐడీ.. అయితే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని హైకోర్టు ఆదేశాలున్నాయి.. ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని లోకేష్‌ను ఆదేశించింది హైకోర్టు.. ఇక, కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 10 గంటలకు లోకేష్ విచారణకు హాజరయ్యారు నారా లోకేష్‌..

అయితే, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో నారా లోకేష్‌ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది..

* ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు ముందే ఎలా తెలుసు?

* మూడుసార్లు అలైన్మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉంది కదా?

* హెరిటేజ్ సంస్థకు లబ్ది చేకూర్చేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు?

* హెరిటేజ్ సంస్థ ఆ ప్రాంతంలోనే ఎందుకు భూములు కొనుగోలు చేసింది?

* 2014 జులై 30న జరిగిన హెరిటేజ్ బోర్డు సమావేశంలో భూముల కొనుగోలుపై తీర్మానం చేశారు కదా?

* లింగమనేని రమేష్ కి మీకు ఉన్న సంబంధం ఏంటి?

* మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు పరిసరల్లోనే భూములు ఎందుకు కొనుగోలు చేశారు?

* A 1 ముద్దాయి చంద్రబాబు నుంచి రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు తెలిసిందా?

* ఇక, పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ ల ఆధారంగా నారా లోకేష్ ను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version