Site icon NTV Telugu

Jani Master: పవన్ కళ్యాణ్ జోలికి వస్తే పీర్ల పండుగే.. జానీ మాస్టర్ ఫైర్

Jani Master

Jani Master

Jani Master: టిడ్కో ఇళ్లను వెంటనే పేదలకి ఇవ్వాలని జనసేన నేత జానీ మాస్టర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో జనసేన నేత జానీ మాస్టర్ ఆధ్వర్యంలో కె.వి.ఆర్ సర్కిల్ నుంచి వెంకటేశ్వరపురంలోని టిడ్కో ఇళ్ల వరకూ ర్యాలీ నిర్వహించారు. టిడ్కో ఇళ్లు గత ప్రభుత్వంలో పూర్తైతే వైసీపీ రంగులు వేసుకుందని ఆయన అన్నారు. పేదల సొంతింటి కల.. కలగానే మిగిలిపోయిందని ఆయన విమర్శించారు. పూర్తైన ఇళ్లలో కొన్నింటిని మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారని.. ఈ కాలనీల్లో పారిశుద్ధ్యం ఘోరంగా ఉందన్నారు. టిడ్కో ఇళ్ల వద్ద జనసేన నాయకులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న జానీ మాస్టర్‌.. టిడ్కో ఇళ్లలో తాగడానికి నీళ్లు కూడా లేవన్నారు.

Read Also: MRO Ramanaiah Case: ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు విచారణ.. కీలకంగా మారిన కాల్‌ డేటా

టిడ్కో ఇళ్లను సంక్రాంతికి ఇస్తాను, దసరాకి ఇస్తానని. చెప్పిన ఎం.ఎల్.ఏ.అనిల్ కుమార్ యాదవ్ పత్తాలేకుండా పోయాడని విమర్శలు గుప్పించారు. ఇళ్ల రంగులకు పెట్టిన సొమ్మును పేదలకి ఇచ్చినా బాగుపడేవారన్నారు. ఏపీ వ్యాప్తంగా సిద్ధం… సిద్ధం.. అని ఫ్లెక్సీలు వేసుకున్నారు. ఎవరి డబ్బు అది అంటూ ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే పీర్ల పండుగేనని.. వైసీపీ నేతలారా…. ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. మీ భవనాలు కళకళలాడాలి… పేదలేమో విలవిలలాడాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లలో భారీ అవినీతికి పాల్పడ్డారని, ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పేదల కోసం కట్టించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేవరకు పోరాడుతానని ఆయన హామీ ఇచ్చారు.

 

Exit mobile version