NTV Telugu Site icon

Chittah Reintroduction Project : మరో 12చిరుతలొస్తున్నాయ్..

Cheetah

Cheetah

Chittah Reintroduction Project : చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ కింద దక్షిణాఫ్రికా నుండి మరో 12 చిరుతలు భారతదేశానికి వస్తున్నాయి. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను రవాణా చేయనున్నారు. ఈ చిరుతలు భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత, దేశంలోని మొత్తం చిరుతల సంఖ్య 20 అవుతుంది.

Read Also: Meat Ban: ఎయిర్ పోర్టుకు 10కి.మీ పరిధిలో మాంసం విక్రయాలు బంద్

భారతదేశంలో అంతరించిపోయిన చిరుతను తిరిగి ప్రవేశపెట్టేందుకు భారత ప్రభుత్వం చీతా రీఇంట్రడక్టరీ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఆ కింద గతేడాది సెప్టెంబర్ 17, 2022న నమీబియా నుంచి ఆర్డర్ చేసిన 8 చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ప్రధాని మోదీ విడుదల చేశారు. ఆ ఎనిమిది చిరుతల్లో 5 ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి. ఈ చిరుతలు అంతరించిపోయిన చిరుతల సంఖ్య పెంచడానికి ఆఫ్రికా నుంచి మరో 12 చిరుతలను ఆర్డర్ చేయనున్నారు.

Read Also: Teddy Love : విచిత్రమైన ప్రేమకథ.. భర్త పోయాక పదేళ్లుగా అన్నీ టెడ్డీ బేర్‌తోనే..

ఫిబ్రవరిలో 12 చిరుతలను దిగుమతి చేసుకున్న తరువాత.. వచ్చే ఎనిమిది నుండి పదేళ్ల వరకు ప్రతి సంవత్సరం 12 చిరుతలను తరలించే ప్రణాళికలు ఉన్నాయని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. ఈ 12 చిరుతలను కూడా తొలుత కునో పార్క్‌కు తరలించనున్నారు. దీనికి సంబంధించి ఇటీవల భారత్-దక్షిణాఫ్రికా మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌ ట్వీట్‌ చేశారు.