NTV Telugu Site icon

Chitra Shukla Pregnancy: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. సీమంతం ఫోటోలు వైరల్!

Chitra Shukla Pregnancy

Chitra Shukla Pregnancy

Actress Chitra Shukla Announced Her Pregnancy: టాలీవుడ్ హీరోయిన్ చిత్ర శుక్లా శుభవార్త చెప్పారు. త్వరలోనే తాను తల్లి కాబోతున్నా అని సోషల్ మీడియాలో తెలిపారు. కుటుంబసభ్యుల మధ్య సాంప్రదాయబద్దంగా జరిగిన తన సీమంతం వేడుకలకు సంబందించిన పోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అభిమానులు, నెటిజన్లు చిత్ర శుక్లాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మధ్యప్రదేశ్‌కి చెందిన పోలీస్ ఆఫీసర్ వైభవ్ ఉపాధ్యాయ్‌ని చిత్ర ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

మధ్యప్రదేశ్‌కి చెందిన చిత్ర శుక్లా 2014లో ‘ఛల్ భాగ్’ హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం పులి, నేను శైలజ చిత్రాల్లో సైడ్ డ్యాన్సర్‌గా కనిపించారు. 2016లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘మా అబ్బాయి’ మూవీతో చిత్ర హీరోయిన్ అయ్యారు. తెలుగులో రంగుల రాట్నం, సిల్లీ ఫెలోస్, తెల్లవారితో గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్ చిత్రాల్లో నటించారు. రంగుల రాట్నం తప్ప మిగతావి అన్నీ ఆమెకు పెద్దగా పేరును తీసుకురాలేదు. చివరగా ‘అహో విక్రమార్క’ సినిమాలో చిత్ర కనిపించారు.

Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు!

2023 డిసెంబర్‌లో వైభవ్ ఉపాధ్యాయ్‌ని చిత్ర శుక్లా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పోలీస్‌ అధికారిగా వైభవ్ పనిచేస్తున్నారు. బయోటెక్నాలజీ పూర్తి చేసిన చిత్రకు.. కాలేజీ రోజుల్లోనే వైభవ్‌తో పరిచయం ఉంది. ఆ స్నేహం ప్రేమగా మారడంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చిత్ర, వైభవ్‌ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు.

Show comments