మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.. సినిమాల దగ్గర నుంచి ఆయన వాడే వస్తువుల వరకు అన్ని ప్రత్యేకంగానే ఉంటాయి.. చిరు ఏదైన ఈవెంట్స్ కు వెళితే అక్కడ స్పెషల్ గా కనిపిస్తాడు.. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ వేడుక ఘనంగా జరిగింది.. ఈ ఫెస్టివల్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు.. ఈ సందర్భంగా మెగాస్టార్‌కి చిరు సత్కారం కూడా చేసిన సంగతి తెలిసిందే..
ఈ సందర్బంగా చిరు పెట్టుకున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్శించింది.. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సినీ ఇండస్ట్రీలోని సెలెబ్రేటీలు ఎక్కువగా ప్రత్యేకంగా కనిపించే వస్తువులను వాడుతారు.. అలాగే చిరు కూడా ఈ ఈవెంట్ కు రోలేక్స్ కంపెనీకి చెందిన వాచ్ ను పెట్టుకున్నాడు.. కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్’ పేరుతో పిలిచే ఈ వాచ్ ధర దాదాపు రూ. 1.90 కోట్లు వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.. ధరలో కాస్త మార్పులు ఉన్నప్పటికీ ఈ వాచ్ ధర విని అంతా షాక్ అవుతున్నారు..
ఇంత సింపుల్ గా ఉండే ఈ వాచ్ ధర దాదాపు రెండు కోట్లా అని షాక్ అవుతున్నారు.. ఈ కార్యక్రమంలో మణిశర్మ, తనికెళ్ల భరణి, మురళీమోహన్, టీజీ విశ్వప్రసాద్, కె.ఎస్.రామారావు, మంచు లక్ష్మీలతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.. ఇక చిరు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..