Site icon NTV Telugu

Chiranjeevi – UV Creations : మరి కాసేపట్లో రానున్న చిరంజీవి కొత్త సినిమా ప్రకటన..

Whatsapp Image 2023 08 22 At 10.34.04 Am (1)

Whatsapp Image 2023 08 22 At 10.34.04 Am (1)

చిరంజీవి లేటెస్ట్ గా నటించిన మూవీ భోళా శంకర్.. భారీ అంచనాలతో విడుదల అయిన చిరంజీవి భోళా శంకర్.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.. దీంతో చిరంజీవి కొంత గ్యాప్‌ తీసుకుని తన తన తరువాత సినిమాల విషయం లో ఒక నిర్ణయం తీసుకుంటాడని సోషల్‌ మీడియా లో బాగా ప్రచారం జరిగింది. కొంత బ్రేక్ తీసుకొన్న తరవాతే తన తరువాత సినిమా ప్రకటన ఉంటుందని రూమర్స్ వచ్చాయి.అయితే ఎంతటి పరాజయం వచ్చిన చిరంజీవి మెగాస్టార్‌ తన ప్రణాళికల్లో ఎలాంటి మార్పు చేయలేదు ఇలాంటి జయాపజయాలు సహజమేనని చిరంజీవి భావించినట్లు తెలుస్తుంది.అందరూ అనుకొన్నట్టుగానే తన పుట్టిన రోజు న నేడు (ఆగష్టు 22) కొత్త సినిమా ప్రకటన రాబోతుంది.దానిలో భాగం గానే కొన్నిగంటల క్రితం యూవీ క్రియేషన్స్‌ ట్విటర్‌ ద్వారా ఒక పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది.

భోళా శంకర్‌ డిజాస్టర్‌ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా ఎవరితో ఉంటుందా అని ఫ్యాన్స్‌ ఎంతో ఉత్కంఠ గా ఎదురు చూస్తున్న సమయం లో తాజాగా యూవీ క్రియేషన్స్‌ అధికారికంగా సోషల్‌మీడియాలో ఒక పోస్టర్‌తో శుభ వార్త తెలిపింది. నేడు 10:53 నిమిషాలకు అనగా ఇంకొన్ని నిమిషాల లోనే మెగాస్టార్‌ మూవీ కి చెందిన పలు వివరాలను ప్రకటిస్తామని వారు వెల్లడించారు.యూవీ క్రియేషన్స్‌-చిరంజీవి కాంబినేషన్‌ లో వస్తున్న ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌ ను బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ టేక్ ఓవర్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నట్లు సమాచారం..మరి కాసేపట్లోనే మెగా స్టార్ చిరు సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ రానుంది. దీనికోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాతో మెగాస్టార్ పాన్ ఇండియా స్థాయి విజయం సాధించాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

https://twitter.com/UV_Creations/status/1693691953974546562?s=20

Exit mobile version