NTV Telugu Site icon

Chiranjeevi: అల్లు- మెగా కుటుంబాల మధ్య విభేదాలు.. మొదటిసారి నోరువిప్పిన చిరు

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఆయన నటించిన వాల్తేరు వీరయ్య మరో రెండు రోజుల్లో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న చిరు సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఉన్న చర్చల్లో ఒకటి అల్లు- మెగా కుటుంబాల మధ్య విభేదాలు. వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని, వారు ఎవరికివారు విడిపోయి బతుకుతున్నారని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా.. అల్లు అర్జున్.. మెగా ఫ్యామిలీ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలపై ఇప్పటికే అల్లు అరవింద్ తనదైన రీతిలో సమాధానం చెప్పుకొచ్చాడు. ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి విబేధాలు లేవని, బయట తామంటే గిట్టని వారు ఇలాంటి పుకార్లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా ఈ వార్తలపై చిరు కూడా స్పందించాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనం చిరంజీవి మాట్లాడుతూ..” అల్లు అరవింద్ పుట్టినరోజున నేను, నా భార్య సురేఖ వారి ఇంటికి వెళ్లి ఆయనకు విషెస్ చెప్పి డిన్నర్ వరకు అక్కడే ఉండి వద్దామని ప్లాన్ చేశాం. ఈ ఒక్క ఘటన చాలు.. మా ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పడానికి, ఇక క్రిస్టమస్ రోజున మా ఇంట్లోనే అందరు కజిన్స్ కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కుటుంబాల పరంగా మేము ఎప్పుడు ఒకటే.. కానీ సినిమాల పరంగా.. ఎవరి పోటీ వారికి ఉంటుంది. ఎప్పుడు మెగా.. మెగా అని పేరు చెప్పుకొని ఉంటే.. వినేవారికి కూడా చిరాకు వేస్తోంది. మా నాన్న గారు నాన్నగారు అని చరణ్ ఎన్నిసార్లని నా పేరు చెప్తాడు. సినిమాల విషయాల్లో ఎవరి పోటీ వారిది.. ఎవరి పేరును వారు నిలబెట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా నేను అమీ అనను. చరణ్ హిట్ అందుకున్నా, బన్నీ హిట్ అందుకున్నా.. వరుణ్, సాయి ధరమ్ తేజ్ చిత్రాలు బాగా ఆడినా నేను సంతోషిస్తాను.” అని చెప్పుకొచ్చారు.

Show comments