Site icon NTV Telugu

Chiranjeevi: ఓటు మీ భాధ్యత, మీ హక్కు.. ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి: చిరంజీవి

Chiranjeevi Vote

Chiranjeevi Vote

Chiranjeevi Cast vote in Hyderabad: తాజాగా ఢిల్లీలో పద్మ విభూషణ్ అందుకుని హైదరాబాద్ తిరిగివచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మెగాస్టార్ ఓటు వేశారు. చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా జూబ్లీ క్లబ్‌కు వచ్చి ఓటేశారు. చిరంజీవి భార్య సురేఖ, కూతురు సుస్మితలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ క్యూలో నిలబడి ఓటు వేశారు.

ఓటు వేసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… ‘ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి. ఎవరి వల్ల రాష్టం, దేశం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే వారిని ఎన్నుకోండి. ఓటు మీ భాధ్యత, మీ హక్కు’ అని అన్నారు. అలానే సోదరుడు పవన్ కల్యాణ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కోసం మెగా ఫామిలీ మొత్తం పిఠాపురం వెళ్లి ప్రచారం చేసింది.

Exit mobile version