ఈ ఏడాది చివరి నుంచే ‘మెగా’ హీరోల సందడి ఉంటుందని అందుకున్నా.. అది కుదరలేదు. 2025 ఆరంభంలో బ్యాక్ టు బ్యాక్ థియేటర్లోకి వచ్చేందుకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నప్పటికీ.. అనధికారికంగా సంక్రాంతికి షిప్ట్ అయినట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి జనవరి 10న ‘విశ్వంభర’తో వస్తానని డేట్ లాక్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు విశ్వంభర పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉండడంతో.. అదే డేట్‌కి గేమ్ ఛేంజర్‌ను తీసుకొచ్చేలా బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. మరి చిరు ప్లేస్‌లోకి చరణ్ వస్తే.. విశ్వంభర ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే మెగాస్టార్‌ను చరణ్ టార్గెట్ చేస్తే.. ఇప్పుడు పవర్ స్టార్ డేట్‌ను మెగాస్టార్ టార్గెట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
Also Read: IND vs BAN: హైదరాబాద్ టీ20లో భారీ మార్పులు.. మరో తెలుగు ప్లేయర్‌కు ఛాన్స్!
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ముందుగా ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కానుంది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను పవన్ రీస్టార్ట్ చేశారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇదే డేట్‌కి విశ్వంభర రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇక్కడ చిరు, పవన్ ఇద్దరు బాక్సాఫీస్ బరిలో ఉంటున్నారని కాదు. ‘అన్నయ్య’ వస్తున్నాడంటే.. ఖచ్చితంగా ‘తమ్ముడు’ తన సినిమాను పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మార్చి 28న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా రిలీజ్‌కు కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి మార్చి 28న ఎవరెవరు వస్తారో చూడాలి.