Chiranjeevi – Mega 158: మెగా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో సంక్రాంతికి సాలిడ్ హిట్‌ను అందుకున్న మెగాస్టార్ అదే ఊపులో తన నెక్ట్స్ ప్రాజెక్టును లైన్‌లో పెట్టడానికి రెడీ అవుతున్నారు. మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు నటించనున్న సినిమాపై రోజురోజుకు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ హిట్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాబోతున్న కొత్త సినిమాలో నటించే నటీనటుల జాబితాపై సోషల్ మీడియాలో రోజుకో కొత్త చర్చ జరుగుతుంది.
READ ALSO: US: రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయమని భారత్ హామీ ఇచ్చింది..
విరామం తీసుకోవడం కంటే సెట్స్‌పై ఉండటానికే ఎక్కువగా ఇష్టపడే మెగాస్టార్, ఈ కొత్త సినిమాను అతి తర్వలో ప్రారంభించబోతున్నారని సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ బాబీ కొల్లి ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి, షూటింగ్ షెడ్యూల్స్‌ను పక్కాగా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవి ఒక ఎమోషనల్, పవర్‌ఫుల్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో కీలకమైన కూతురు పాత్ర కోసం మొదట కృతి శెట్టి పేరు వినిపించింది, ఆ తర్వాత ధురంధర్ బ్యూటీ సారా అర్జున్‌ను దాదాపు ఖరారు చేసినట్లు చర్చ నడిచింది, అయితే ప్రస్తుతం మరొక బ్యూటీ పేరు ఈ జాబితాలో చేరింది. ఇటీవల కాలంలో ఛాంపియన్, విత్ లవ్ వంటి వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న అనస్వర రాజన్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. చిరు కూతురి పాత్ర ఆమెను దాదాపు ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. సినిమాలో చిరు డాటర్ పాత్రకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉండటంతో, డైరెక్టర్ చాలా జాగ్రత్తగా ఆ రోల్ ప్లే చేసే వారిని ఎంపిక చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో అనస్వర నటన సినిమాకు మరింత బలం చేకూర్చనుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు స్కోప్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఒక సీనియర్ హీరోయిన్‌తో పాటు, మరో క్రేజీ హీరోయిన్ కోసం చిత్రబృందం కసరత్తు చేస్తోందని టాక్ నడుస్తుంది. గతంలో చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. మళ్లీ అదే క్రేజీ కాంబో సెట్స్ మీదకు వెళ్తుండటంతో మెగా ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈసారి మాస్ ఎలిమెంట్స్‌తో పాటు తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌ను బాబీ ఎలా డీల్ చేస్తారో చూడాలని మెగా ఫ్యాన్స్‌తో పాటు, సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
READ ALSO: Peddi Update: గ్రౌండ్‌లోకి దిగిన గ్లోబల్ స్టార్ టీమ్.. స్పోర్ట్స్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్న ‘పెద్ది’ !
