Site icon NTV Telugu

Chiranjeevi Balakrishna : ‘అఖండ2’ దెబ్బతో.. బాలయ్య‌కు ప్రశంసలు.. చిరంజీవి‌కి ప్రశ్నలు

Chiranjeevi Balaya

Chiranjeevi Balaya

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఎంపికపై ఎప్పుడు చర్చ నడుస్తుంటుంది. అయితే, తన వయస్సుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ, కథాబలం ఉన్న సినిమాల‌తో బాలకృష్ణ వరుస విజయాలు అందుకుంటున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’లో, ఇప్పుడు ‘అఖండ 2’లో సైతం 50 ఏళ్ల వ్యక్తి పాత్రలో నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మరోవైపు, ఆయన తోటి సీనియర్ హీరో అయిన చిరంజీవి మాత్రం దీనికి భిన్నంగా, ఇప్పటికీ యంగ్ హీరోయిన్లతో డ్యాన్స్‌లు, డ్యూయెట్‌లు చేస్తూ, యంగ్ లుక్‌లో కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. దాదాపు 70 ఏళ్ల వయస్సులో కూడా తన ఏజ్‌కు తగ్గ పాత్రలు చేయకుండా, యాక్షన్ మరియు రొమాన్స్ ఫార్ములాకే కట్టుబడి ఉండటం పై చాలా మంది విమర్శకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Also Read : Premante OTT: ప్రియదర్శి ‘ప్రేమంటే’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!

ఈ విషయంలో చిరంజీవి, బాలయ్య బాబును చూసి నేర్చుకుంటే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సలహాలు ఇస్తున్నారు. బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా విజయాలు అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే, చిరంజీవి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేకపోయారు. అందువల్ల, చిరంజీవి ఇప్పటికైనా తన ఏజ్‌కు తగ్గ కథలను ఎంచుకోవాలని, డ్యాన్స్‌లు, ఫైట్‌లు కాకుండా కొత్త కథాంశాలతో ముందుకు రావాలని విమర్శకులు కోరుకుంటున్నారు. ఇలా పాత్రల ఎంపికలో మార్పు చేసుకుంటేనే, చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మరింత విజయవంతం‌గా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version