NTV Telugu Site icon

Chiranjeevi-Anil Ravipudi: చిరు-అనిల్ సినిమాకు ముహూర్తం ఫిక్స్?

Chiranjeevi Anil Ravipudi

Chiranjeevi Anil Ravipudi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. వాస్తవానికైతే ఈ సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సమ్మర్‌కి పోస్ట్ పోన్ అయింది. అయితే త్వరలోనే విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. బింబిసార తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా కావడం, సోషియో ఫాంటసీ డ్రామా కావడంతో విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు చిరు. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో ఈ సినిమా ఊరమాస్‌గా ఉండబోతోంది.

చిరంజీవి నెక్స్ట్ లైనప్‌లో అనిల్ రావిపూడి ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిరు సినిమా సంక్రాంతి కానుక‌గా అధికారికంగా ప్రారంభం కాబోతున్న‌ట్లు తెలుస్తోంది. సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో జ‌న‌వ‌రి 15న పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని.. జూలై నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్న‌ట్లుగా సమాచారం. షైన్‌స్క్రీన్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

Also Read: Mohan Babu: గతం గతః.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్!

ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. మెగాస్టార్‌ను అందరూ ఎలా చూడాలని కోరుకుంటున్నానో అలాగే ప్రెజెంట్ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ ఓదెల ఒకలా చూపిస్తే.. నేను చిరంజీవిని ఇంకోలా చూపిస్తానని, ఫైనల్‌గా ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా కథలు రాసుకుంటానంటూ చెప్పుకొచ్చాడు. మరి మెగాస్టార్‌తో అనిల్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.