Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chintur Agency Rains Update: పోలవరం జిల్లాలోని చింతూరు ఏజెన్సీలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతోంది. శబరి, గోదావరి నదుల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఇళ్లు, పశువులు, పంటలకు జరిగిన నష్టాలపై 24 గంటల్లో సమగ్ర నివేదిక అందజేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
చింతూరు ఏజెన్సీలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం 28.5 అడుగులుగా నమోదవగా.. కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 30 అడుగులకు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పడవలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
వరద బాధితులకు వెంటనే నిత్యావసర వస్తువులు అందజేసి అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. నది పరివాహక ప్రాంత ప్రజలు మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వరద ప్రభావిత గ్రామాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసి బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?