Site icon NTV Telugu

Arijit Singh : స్టార్‌డమ్ వచ్చినా అరిజిత్ మారలేదు.. చిన్మయి షాకింగ్ పోస్ట్

Chinmayi Arjitsigh

Chinmayi Arjitsigh

మెలోడీ కింగ్ అరిజిత్ సింగ్ పాటలకు గుడ్ బై చెప్పేస్తున్నాడన్న వార్త విన్నప్పటి నుండి అభిమానులు షాక్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే సింగర్ చిన్మయి శ్రీపాద ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అరిజిత్ ఇంకా స్టార్ సింగర్ కాకముందు నుండే తనకు తెలుసని, ‘తుమ్ హి హో’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన తర్వాత కూడా ఆయనలో ఇసుమంతైనా గర్వం రాలేదని చిన్మయి చెప్పుకొచ్చారు. అరిజిత్ కేవలం గొప్ప గాయకుడే కాదు, ఆధ్యాత్మికంగా ఎంతో పరిణితి చెందిన వ్యక్తి అని, ఆయన నిర్ణయాల వెనుక ఏదో ఒక దైవికమైన కారణం ఉంటుందని ఆమె ఎమోషనల్ అయ్యారు.

Also Read : Mrunal Thakur : కోలివుడ్ లవర్ బాయ్‌కి జోడిగా.. మృణాల్ ఠాకూర్ !

అయితే ఈ పోస్ట్‌కు ఒక యూజర్ “మీరు ఒక మగాడి గురించి మంచిగా మాట్లాడటం బాగుంది” అని వెటకారంగా కామెంట్ చేయగా, చిన్మయి తనదైన స్టైల్లో గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘నాకు తెలిసిన మగవాళ్లలో చాలా మంది మంచివారే ఉన్నారు, అందుకే నా చుట్టూ ఉన్నవాళ్లలో సోషల్ మీడియాలో బూతులు తిట్టే రకం మనుషులు ఎవరూ లేరు’ అని రిప్లై ఇచ్చారు. ముఖ్యంగా ఎక్స్‌ (ట్విట్టర్)లో చాలా మంది మగవాళ్లు ఎదుటివారిని దూషించడమే పనిగా పెట్టుకుంటారని, అలాంటి వారిని చూసి అందరినీ ఒకేలా ఊహించుకోవద్దని ఆమె పరోక్షంగా చురకలు అంటించారు. ప్రస్తుతం ఈ జవాబు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

 

Exit mobile version