NTV Telugu Site icon

Chinese spy balloon: కలకలం సృష్టించిన బెలూన్‎ను కూల్చేసిన అమెరికా

China Balloon

China Balloon

Chinese spy balloon: అణ్వాయుధ స్థావరాలు మీదుగా ఎగురుతున్న చైనా గూఢచారి బెలూన్‌‌ను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ గుర్తించింది. అధ్యక్షుడు జో బైడెన్ సూచన మేరకు డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్, ఉన్నత సైనిక అధికారులు బెలూన్‌ను పేల్చివేయాలని భావించారు.. కానీ, అలా చేయడం ప్రమాదని డిఫెన్స్ సీనియర్ అధికారి అన్నారు. వాయువ్య ప్రాంతంలో సున్నితమైన ఎయిర్‌బేస్‌లు, క్షిపణి వ్యవస్థలున్న సిలోస్ అండర్‌గ్రౌండ్ మీదుగా ఈ గూఢచారి బెలూన్ ఎగురుతోందని చెప్పారు. చివ‌ర‌కు దాన్ని కొన్ని గంట‌ల క్రితం ఆ బెలూన్ ను త‌మ దేశ యుద్ధ విమానాల సాయంతో స‌ముద్రత‌లాల వైపున‌కు తీసుకొచ్చి పేల్చేసిన‌ట్లు అమెరికా ర‌క్షణ శాఖ ప్రకటించింది. దీనిపై చైనా స్పందించింది. మాన‌వ‌ర‌హిత బెలూన్ ను పేల్చివేయ‌డం ప‌ట్ల నిర‌సన‌ వ్యక్తం చేస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ‌ వెల్లడించింది. కాగా, బెలూన్ ను పేల్చిన దృశ్యాల‌ను అమెరికా వార్తా ఛానెళ్లు ప్రసారం చేశాయి.

Read Also: Off The Record: పవన్‌ను బీజేపీ నమ్మడం లేదా? అనుమానం వచ్చిందా?

ఆ బెలూన్ ను ఎఫ్‌-22 యుద్ధ విమారనం సాయంతో పేల్చేశాయి. ద‌క్షిణ కాలిఫోర్నియా మర్టల్ బీచ్ ప్రాంతంలో ఆ బెలూన్ శ‌క‌లాలు పడ్డాయి. వాటిని సేక‌రించేందుకు మిల‌ట‌రీ సిబ్బంది ప్రయ‌త్నాలు చేస్తున్నారు. అమెరికా, చైనా మ‌ధ్య ప్రతికూల వాతావ‌ర‌ణం నెల‌కొన్న నేప‌థ్యంలో ఈ బెలూన్ క‌ల‌క‌లం రేప‌డం గ‌మ‌నార్హం. తైవాన్ విష‌యంతో పాటు చైనాలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌, ద‌క్షిణ చైనా స‌ముద్రం వంటి అంశాల‌పై ఇరు దేశాల మ‌ధ్య వివాదం కొన‌సాగుతోంది. చైనా బెలూన్ ను అమెరికా మిల‌ట‌రీ విమానం నుంచి కూడా అధికారులు ముందుగా ప‌రిశీలించారు. ఈ విష‌యాన్ని చైనా అధికారుల ముందు కూడా అమెరికా అధికారులు లేవ‌నెత్తారు.