Site icon NTV Telugu

Chinese Manja: పీకలు కోస్తున్న పతంగులు.. బైక్ పై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మెడకు చుట్టుకున్న చైనా మాంజా

Manja

Manja

సంక్రాంతి వేడుకల్లో పతంగులు ఎగరేయడం ఒక భాగం. చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా కైట్స్ ఎగరేస్తూ ఖుష్ అవుతుంటారు. అయితే ఈ పతంగులు ఎగరేసే క్రమంలో ప్రమాద భారిన పడి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. కరెంట్ షాక్ తో, బిల్డింగ్ పై నుంచి పడి మృత్యువుని కొనితెచ్చుకుంటున్నారు. ఇదే కాకుండా చైనా మాంజా పీకలు కోస్తోంది. మనుషులతో పాటు, పక్షులను కూడా హరిస్తోంది. బైకులపై వెళ్తున్న వాహనదారుల మెడలకు తగిలి తీవ్రంగా గాయపరుస్తోంది. తాజాగా చైనా మాంజా కి మరో గొంతు తెగింది. ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో బైక్ పై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సాయి వర్ధన్ రెడ్డి మెడకు మాంజా చుట్టుకున్నది. మెడపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version