NTV Telugu Site icon

Giant Pendulum : జీవితంలో మరోసారి జాయింట్ వీల్ పదం అంటే హడలిపోతారేమో !

Joint Wheel

Joint Wheel

Giant Pendulum : చైనాలోని అన్ హుయ్ ప్రావిన్స్ లో కొందరకు పర్యాటలకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన జాయింట్ వీల్ విరగడంతో పదినిమిషాల పాటు నరకం అనుభవించాల్సి వచ్చింది. తలకిందులుగా వేలాడడంతో ప్రాణభయంతో హడలెత్తిపోయారు. ఆ పార్క్ సిబ్బంది, రక్షణ బలగాలు వారికి సాయం అందించడంతో పర్యాటకులంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే.. ఫుయాంగ్ నగరంలోని అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను కొందరు పర్యాటకులు సందర్శించారు. ఈ క్రమంలో వారు థ్రిల్ కోసం జాయింట్ పెండ్యులం ఎక్కారు. వారు ఎక్కిన కాసేపటికీ రైడ్‌ విరిగింది. ఆ రైడ్‌ పది నిమిషాలపాటు కదలలేదు. దానిపై ఉన్న పర్యాటకులు చాలా ఎత్తు నుంచి తలకిందులుగా వేలాడారు.

Read Also:UK PM Rishi Sunak : సీట్ బెల్ట్ పెట్టుకోనందుకు ఫైన్ కట్టిన ప్రెసిడెంట్

ప్రాణ భయంతో కేకలు వేశారు. కాగా, ఆ రైడ్‌ను సరిసేందుకు అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ సిబ్బంది చాలా శ్రమపడ్డారు. కంట్రోల్‌ను తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నించగా ఫలించలేదు. దీంతో ఒక వ్యక్తి ఆ రైడ్‌ పైభాగానికి వెళ్లి దానిని సరిచేశాడు. అయితే ఎక్కువ మంది ఎక్కడం వల్లనే ఈ సమస్య వచ్చిందని అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ అధికారులు తెలిపారు. దానిపై చిక్కుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చినట్లు చెప్పారు. ఈ సంఘటన వల్ల అనారోగ్యానికి గురైన వారికి వైద్య ఖర్చులపరంగా సహాయం చేస్తామని వెల్లడించారు. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.